మే 23న ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:03 AM
ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్‌డ్-2027 పరీక్ష వచ్చే ఏడాది మే 23న జరగనుంది.
న్యూఢిల్లీ, నవంబరు 13: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) అడ్వాన్స్‌డ్-2027 పరీక్ష వచ్చే ఏడాది మే 23న జరగనుంది. ఈసారి పరీక్షను ఐఐటీ ఢిల్లీ నిర్వహించనుంది. జేఈఈ మెయిన్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులు. 10 నుంచి 12 అంకెలు కనిపించే నాన్ సైంటిఫిక్ కాలిక్యులేటర్‌ను పరీక్షలో ఉపయోగించుకునేందుకు అనుమతిస్తారు. అభ్యర్థులకు గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులుhttps://jeeadv.ac.in వెబ్‌సైట్ సందర్శించాలని ఐఐటీ ఢిల్లీ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు