Share News

వికారాబాద్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 15 ఎకరాల్లో పంటలు దగ్ధం

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:30 PM

వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం లఖ్నాపూర్ సమీపంలో పంట పొలాల్లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో రైతులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వికారాబాద్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్.. ఈ మంటలను అర్పివేసింది.

వికారాబాద్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 15 ఎకరాల్లో పంటలు దగ్ధం

వికారాబాద్, నవంబర్19: జిల్లాలోని పరిగి మండలం లఖ్నాపూర్ సమీపంలో పంట పొలాల్లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో రైతులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వికారాబాద్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్.. ఈ మంటలను అర్పివేసింది. 15 ఎకరాల్లో మొక్కజొన్న, కంది పంటలు దగ్ధమయ్యాయి. నూర్పిడి చేసి కుప్పగా ఉంచిన కంది పంటతోపాటు మొక్కజొన్న కూడా పూర్తిగా దగ్ధమైంది. దీంతో అప్పు చేసిన పంటలు వేసిన రైతులు అంజిలయ్య, భేరి నాగరాజు కుటుంబాలు కన్నీరుమున్నీరు అవుతున్నాయి.


దాదాపు రూ.12 లక్షల నష్టం వాటిల్లిందని.. తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆయా కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంజిలయ్య పదెకరాలు, నాగరాజు రెండెకరాలతోపాటు యాదయ్యకు చెందిన మొక్కజోన్న కుప్ప అగ్నికి ఆహుతి అయింది. తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. పక్క పొలం నుంచి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు ఈ సందర్భంగా వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రహదారుల నిర్మాణాల్లో ఎక్కడ రాజీ పడొద్దు: ఇంజినీర్లకు కేంద్రమంత్రి సూచన

సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..? వాహనదారులకు బిగ్ అలర్ట్

For More TG News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 06:37 PM