మా ఫోన్‌లను హ్యాక్ చేస్తున్నారు.. ఎవరినీ వదలం: హరీశ్ రావు
ABN , Publish Date - Apr 28 , 2026 | 01:34 PM
ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రైతులు, రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. ఎవరు మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి, ఏప్రిల్ 28: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ మూర్కత్వం.. హిట్లర్‌ను మించిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌పై దాడి కేసులో జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్‌ను హరీశ్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంత మంది ఐపీఎస్‌లు తమ ఫోన్‌లను.. ఇంటి ముందున్న సిసి కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకొచ్చి తమపై నిఘా పెడుతున్నారన్నారు. ‘అలాంటి అధికారులు జాగ్రత్త.. మీరు రిటైర్డ్ అయినా మిమ్మల్ని వదలం’ అని హెచ్చరించారు.
మన్నే క్రిశాంక్‌తో పాటు ఏడుగురిపై అక్రమ కేసు పెట్టారని మాజీ మంత్రి మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. రైతులు, రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. ఎవరు మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీపై అక్రమ పోస్టులు పెడుతున్నారని పోలీసులకు క్రిశాంక్ ఫిర్యాదు చేశారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లపై కేసులు పెట్టాల్సింది పోయి ఫిర్యాదు చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు పెట్టారని మండిపడ్డారు. నాన్ బెయిలబుల్ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. బెయిల్ ఇవ్వాల్సిన కేసును పాత కేసులు చూపెట్టి జైల్లో వేశారని ఆరోపించారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే కేసు పెడతారా అని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు.
ఇవి కూడా చదవండి...
గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి బెయిల్
Read Latest Telangana News And Telugu News