కోటి మందికిపైగా స్మార్ట్ రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నాం: జగ్గారెడ్డి
ABN , Publish Date - Aug 10 , 2026 | 02:49 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 15న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సీఎం పంపిణీ చేయనున్నారు.
సంగారెడ్డి, ఆగస్టు 10: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 15న జిల్లాలో పర్యటించనున్నారు. సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సీఎం పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈరోజు(సోమవారం) తారా డిగ్రీ కాలేజీలో హెలిప్యాడ్, అంబేద్కర్ స్టేడియంలో సభా స్థలిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ... పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చారని విమర్శించారు. కోటి 5 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ కమిట్‌మెంట్‌తో పని చేస్తోందని జగ్గారెడ్డి తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షించదగిన విషయమన్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమైనా కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్‌కు ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. సభని 50 వేల మందితో నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
‘హర్ ఘర్ తిరంగా’తో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలి: రాంచందర్ రావు
మనుషులకు ‘ఆధార్’ లాగే.. భూములకూ ‘భూధార్’: మంత్రి పొంగులేటి
Read Latest Telangana News And Telugu News