ఏపీ పీపీపీ పాలసీ-2026 విడుదల.. రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్
ABN , Publish Date - Aug 10 , 2026 | 01:11 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.
అమరావతి, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ(పబ్లిక్ - ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పాలసీ -2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047కు అనుగుణంగా రాష్ట్రంలో భారీ పెట్టుబడులే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర రంగాల్లో పీపీపీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టుల పైప్‌లైన్ ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
2026- 27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్ల స్టేట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)ను ప్రభుత్వం కేటాయించింది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక మూలధన అవసరాలను VGF ద్వారా సర్కార్ భర్తీ చేయనుంది. ప్రాజెక్టుల ప్లానింగ్, అప్రైజల్, ప్రొక్యూర్‌మెంట్, అమలు, పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకంగా లేని, భవిష్యత్తులో ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులకు ప్రాజెక్ట్ వయబిలిటీ బ్రిడ్జి ఫండ్ ద్వారా వడ్డీలేని రుణాన్ని అందించే విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ప్రైవేట్ రంగ పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను వినియోగించుకోవడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. నాణ్యమైన ప్రజా సేవలను అందించడంతో పాటు పెట్టుబడిదారులకు అనుకూలమైన మౌలిక వసతుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న పీపీపీ విధానాలను పరిశీలించడంతో పాటు, సంబంధిత స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు పీపీపీ పాలసీ-2026ను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. తాడిపత్రిలో హైటెన్షన్
లండన్‌లో మంత్రి నారాయణ బృందం.. అమరావతి ఐకానిక్ భవనాలపై కీలక చర్చలు
Read Latest AP News And Telugu News