మనుషులకు ‘ఆధార్’ లాగే.. భూములకూ ‘భూధార్’: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:23 PM
తెలంగాణ వ్యాప్తంగా గత పాలకులు ఆర్భాటంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని.. ఎక్కడ కూడా ఆఫీసులు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
హనుమకొండ, ఆగస్టు 10: జిల్లాలోని ఎల్కతుర్తిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గత పాలకులు ఆర్భాటంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని.. ఎక్కడ కూడా ఆఫీసులు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.600 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 180 రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాలను యుద్ధ ప్రాతిపదికన సంవత్సరంలోపు పూర్తి చేశామని తెలిపారు.
ధరణిని బంగాళాఖాతంలో వేశామని.. భూభారతి చేపట్టి రైతులకు పూర్తి భద్రత, భరోసా ఇచ్చేలా భూములను ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ విలేజ్‌లోని ప్రతి అంగుళాన్ని సర్వే చేసి మనిషికి ఎలాగైతే ఆధార్ ఉందో, భూములకు కూడా భూధార్ ఇస్తామని చెప్పారు. రైతులందరి సహకారంతో భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక భద్రత, భరోసా కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మెడికో ప్రియాంక కేసు.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్న రాజమండ్రి ఎమ్మెల్యే
‘హర్ ఘర్ తిరంగా’తో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలి: రాంచందర్ రావు
Read Latest Telangana News And Telugu News