Share News

టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. తాడిపత్రిలో హైటెన్షన్

ABN , Publish Date - Aug 10 , 2026 | 09:58 AM

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి పిలుపునిచ్చారు.

టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. తాడిపత్రిలో హైటెన్షన్
Tadipatri tension

అనంతపురం, ఆగస్టు 10: జిల్లాలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి పిలుపునిచ్చారు. వైసీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకూ నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కేతిరెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ర్యాలీ ప్రారంభించిన వెంటనే పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని కేతిరెడ్డిని ఇంటి వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు.


మరోవైపు తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో జేసీ నివాసం వద్దకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. అయితే తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తాడిపత్రిలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే చర్యలకు తాము అనుమతించేది లేదని తేల్చిచెప్పారు.


వైసీపీ రాయలసీమ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి.. తాడిపత్రికి బయలుదేరారు. అయితే ముచ్చుకోట ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రి వెళ్లి తీరుతానంటూ పెద్దిరెడ్డి పట్టుబట్టా.. తాడిపత్రిలోకి బయట వ్యక్తులను అనుమతించేది లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో పోలీసులతో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి వాగ్వివాదానికి దిగారు.


ఇవి కూడా చదవండి...

వైఎస్‌ హయాంలోనే డీఎస్సీలో అక్రమాలు

రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 10 , 2026 | 10:19 AM