Share News

వైసీపీవి రాజకీయ డ్రామాలు

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:30 AM

డీఎస్సీపై వైసీపీ రాజకీయ డ్రామాలను తిప్పికొట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో..

వైసీపీవి రాజకీయ డ్రామాలు

  • టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ఎండగట్టాలి: అచ్చెన్న

టెక్కలి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): డీఎస్సీపై వైసీపీ రాజకీయ డ్రామాలను తిప్పికొట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఆయన మాట్లాడుతూ గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ఎండగట్టాలన్నారు. ఐదేళ్లు ప్రజలను భయపెట్టి పాలించిన గొడ్డలి పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాజకీయ ముసుగులో గొడ్డలి పార్టీ రౌడీయిజం, అరాచకాలు చేస్తున్న గంజాయి ముఠాలు, బ్లేడు బ్యాచ్‌లను వదిలేయాలా అని ప్రశ్నించారు.

Updated Date - Aug 10 , 2026 | 04:31 AM