Share News

శాసనసభ రద్దు చేయండి.. సీఎం రేవంత్‌కి బీజేపీ ఎంపీ సవాల్

ABN , Publish Date - Jun 14 , 2026 | 06:15 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదని మెదక్ ఎంపీ, బీజేపీ నేత ఎం.రఘునందర్ రావు మండిపడ్డారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి గురించి అనవసరంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసనసభ రద్దు చేయండి.. సీఎం రేవంత్‌కి బీజేపీ ఎంపీ సవాల్
MP Raghunandan Rao

మెదక్, జూన్14: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదని మెదక్ ఎంపీ, బీజేపీ నేత ఎం.రఘునందర్ రావు మండిపడ్డారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి గురించి అనవసరంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మెదక్‌లో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి శాసనసభను రద్దు చేస్తే, రాష్ట్రంలో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. మీకు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి.. 8 మంది బీజేపీ ఎంపీలం రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు.


మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా అవసరం లేదని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. కేవలం అసెంబ్లీ మాత్రమే రద్దు చేయ్యాలని సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు. అనంతరం ప్రజాక్షేత్రంలోకి పోదామని తెలంగాణ సీఎంకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కల్లాల్లోని ధాన్యం పోక.. బ్యాంకుల్లో నగదు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడితున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నుంచి స్పందన లేదన్నారు. నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి.. కేంద్ర పథకాలతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రగల్బాలు పలకడం కాదు చేతనైతే తన సవాల్ స్వీకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఎం.రఘునందన్ రావు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాటేజీ అప్పగించని వైసీపీ ఎమ్మెల్యే.. స్పందించిన శ్రీశైలం దేవస్థానం సభ్యుడు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. సీనియర్ ఐఏఎస్‌కు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం

For More TG News And Telugu News

Updated Date - Jun 14 , 2026 | 06:31 PM