Share News

గే యాప్‌లో దోస్తీ.. రూ.18 లక్షలు పాయె..!

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:22 AM

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలానికి చెందిన ఓ వ్యక్తికి గే యాప్‌లో ఏపీకి చెందిన వ్యక్తితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకునేదాకా వెళ్లింది.

గే యాప్‌లో దోస్తీ.. రూ.18 లక్షలు పాయె..!
Gay dating app fraud

  • జడ్చర్ల యువకుడికి ఏపీ వాసి టోకరా

జడ్చర్ల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలానికి చెందిన ఓ వ్యక్తికి గే యాప్‌లో ఏపీకి చెందిన వ్యక్తితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకునేదాకా వెళ్లింది. అక్కడ్నించి ఇద్దరూ అదేపనిగా మాట్లాడుకునేవారు. ఇదే అదనుగా ఏపీ వ్యక్తి జడ్చర్ల వాసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బీఈడీ చదువుతున్న బాధితుడి ఖాతాలో ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పునరావాస పరిహారంలో భాగంగా రూ.18 లక్షలు జమవ్వగా.. రూ.6 లక్షలు ఖర్చు చేసుకున్నాడు. ఇటీవల ఓ గే యాప్‌లో చేరాడు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా క్రోసూర్‌ మండలం దొడ్లేరుకు చెందిన తమ్మిశెట్టి నాగార్జునతో దోస్తీ కుదిరింది.


జడ్చర్ల యువకుడి బలహీనతలను ఆసరాగా చేసుకున్న నాగార్జున.. తన తల్లికి ఆరోగ్యం బాగా లేదంటూ తొలుత రూ.200 తీసుకున్నాడు. అనంతరం 3 నెలల్లో ఏకంగా రూ.11.50 లక్షలు తన ఖాతాలోకి వేయించుకున్నాడు. మళ్లీ డబ్బులు కావాలని ఒత్తిడి చేశాడు. ఇవ్వకపోవడంతో బెదిరించాడు. దిక్కుతోచని బాధితుడు తన అక్క బంగారాన్ని కుదువబెట్టి రూ.2.50 లక్షలు, మరోసారి రూ.2.50 లక్షలు, వరుసకు సోదరుడి దగ్గర మరో రూ.1.50 లక్షలు అప్పుచేసి చెల్లించాడు. ఇలా మొత్తం రూ.18 లక్షలు ఇచ్చాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వబోనని, మళ్లీ అడిగితే చంపేస్తానని నాగార్జున బెదిరించాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రూ.6 లక్షలు రికవరీ చేసినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆటలు ముగిసినా వసతులు నిలవాలి

ఉత్సాహంగా బీజేపీ మహా పాదయాత్ర

లోలోతుల్లోకి భూగర్భజలాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 05:22 AM