కాల్వలనాగరంలోని ఫారెస్ట్ భూములపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - May 06 , 2026 | 08:06 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కాల్వలనాగరంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 600 ఎకరాల భూమిపై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది.
న్యూఢిల్లీ, మే06: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కాల్వలనాగరంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 600 ఎకరాల భూమిపై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. రెవెన్యూ రికార్డులు కేవలం పన్నుల వసూలుకే అని స్పష్టం చేసింది. అవి యాజమాన్య హక్కులను కల్పించవని పేర్కొంది. ఈ వ్యవహారంలో గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి ధర్మాసనం సమర్థించింది.
సర్వే నంబర్ 81లోని 600 ఎకరాల భూమిని అటవీ భూమిగా గుర్తిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులు యథాతథమని స్పష్టం చేసింది. దాంతో 1950 నాటి నిజాం కాలపు ఫారెస్ట్ గెజిట్ నోటిఫికేషన్‌ను సవాలు చేసిన అప్పీలుదారులకు చుక్కెదురు అయింది. పట్టా సర్టిఫికేట్ లేకుండా కేవలం పహాణీలు, ఫైసల్ పట్టీల ఆధారంగా యాజమాన్య హక్కులు రావని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రెవెన్యూ రికార్డులు కేవలం పన్నుల అవసరాల కోసం మాత్రమేనని వెల్లడింది. అప్పీలుదారులు తమ క్లెయిమ్‌ను నిరూపించే అసలు డాక్యుమెంట్లు సమర్పించ లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ఈ భూములపై దశాబ్దాలగా సాగుతున్న న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరదించినట్లు అయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక సూచనలు
కలిసి పని చేస్తే బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది: రాయపాటి శైలజ
For More TG News And Telugu News