Share News

వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక సూచనలు

ABN , Publish Date - May 06 , 2026 | 08:32 PM

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు వచ్చేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ట్రేసబిలిటి, సర్టిఫికేషన్ విధానం ద్వారా పంటలకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు.

వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక సూచనలు
AP CM Chandrababu Naidu

అమరావతి, మే 06: మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు వచ్చేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ట్రేసబిలిటి, సర్టిఫికేషన్ విధానం ద్వారా పంటలకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని ఆయన సూచించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్రంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.


ఈ ఏడాది 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి వస్తుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. రైతులకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన దిగుబడులకు కృషి చేయాలని వారికి స్పష్టం చేశారు. ప్రకృతి సేద్యం విధానంలో వివిధ పంటలను పండించటం ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాల్వలనాగరంలోని ఫారెస్ట్ భూములపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

కలిసి పని చేస్తే బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది: రాయపాటి శైలజ

For More AP News And Telugu News

Updated Date - May 06 , 2026 | 08:47 PM