మావోయిస్టుల డంప్‌లో 33 బంగారు బిస్కెట్లు
ABN , Publish Date - Nov 29 , 2026 | 01:34 AM
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన భారీ డంప్ లభ్యమైంది.
రూ.4.90 కోట్ల విలువ చేసే 3.84 కిలోల బంగారం
రూ.24.22 లక్షల నగదు.. బీజాపూర్ అడవుల్లో స్వాధీనం
చర్ల, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన భారీ డంప్ లభ్యమైంది. ఇంద్రావతి నది అడవుల్లో శుక్రవారం లభ్యమైన ఈ డంప్‌లో ఒక్కొక్కటి 10 తులాలకు పైగా బరువున్న 33 బంగారు బిస్కెట్లు, రూ.24.22 లక్షల నగదును బీజాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్పీ ఉమేశ్ప్రసాద్ గుప్తా వివరాలు వెల్లడించారు.
తమకు అందిన పక్కా సమాచారంతో డీఆర్జీ, బాంబుస్క్వాడ్ బృందం శుక్రవారం ఉదయం తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో డంప్‌ను గుర్తించామని, అందులో ఇనుప పెట్టెలో దాచిన 3.84 కిలోల బరువున్న 33 బంగారు బిస్కెట్లు, రూ.24.22 లక్షల నగదు లభ్యమయ్యాయన్నారు. ఈ బంగారు బిస్కెట్ల విలువ ప్రస్తుత ధర ప్రకారం రూ.4.90 కోట్లకు పైనే ఉంటుంది. మావోయిస్టుల డంప్‌ల కోసం కూబింగ్ కొనసాగుతుందని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News