రెచ్చిపోతున్న మట్టి మాఫియా!
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:43 AM
ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సి పాలిటీ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమార్కులు ఇసుక డంప్‌ల మాదిరిగానే పదుల సంఖ్యలో మట్టిని కూడా డంప్ చేస్తున్నారు.
ఇసుక డంప్‌లను తలపిస్తున్న మొరం నిల్వలు
ఏదులాపురంలో ప్రభుత్వ భూములే టార్గెట్?
అర్ధరాత్రి వేళ.. వందలాది టిప్పర్లతో అక్రమ రవాణా
ఒక్కో ట్రక్కు రూ.5 వేలకు పైనే..
మామూళ్ల మత్తులో మైనింగ్ అధికారులు?
ఖమ్మం: జిల్లాలోని ఏదులాపురం మున్సి పాలిటీ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమార్కులు ఇసుక డంప్‌ల మాదిరిగానే పదుల సంఖ్యలో మట్టిని కూడా డంప్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములే టార్గెట్‌గా పెట్టుకొని.. ఎలాంటి అనుమతులు లేకుండా ఆ భూ ముల్లోని మట్టిని అర్ధరాత్రి వేళ వందల టిప్పర్లలో తరలిస్తూ.. ఖాళీ ప్రదే శాలు, వెంచర్‌లలో డంప్ చేస్తున్నారు. ఈ మట్టిని పగటిపూట వెంచర్లకు తరలిస్తూ అతి తక్కువ కాలంలో రూ.లక్షలు గడిస్తున్నారు. ఇంత జరుగుతు న్నా.. సంబంధిత మైనింగ్ శాఖాధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలు తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూములే లక్ష్యంగా..
మట్టి మాఫియాకు ప్రభుత్వ భూములే టార్గెట్‌గా మారాయి. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం, వెంకటగిరి, మద్దులపల్లి, తెల్దారు పల్లి, గొల్లగూడెం, రూరల్ మండలంలోని మంగళగూడెం, కస్నాతండా, వాల్యాతండా, ఆరెకోడు, వెంకటాయపాలెం తదితర గ్రామాల్లో ఈ మట్టి దందా జోరుగా సాగుతోంది. అర్ధరాత్రి సమయంలో వందల టిప్పర్లు, డంపర్లతో.. అక్రమార్కులు వేలాది ట్రిప్పుల మట్టి తోలకాలు సాగిస్తున్నారు. నిత్యం రాత్రి వేళల్లో పలు గ్రామాల మీదు గా లారీల్లో మట్టి తరలిస్తుండడంతో.. ఆయా గ్రామాల ప్రజలు కంటిమీద కునుకు లేకుండా భయంనీడన కాలం వెల్లదీస్తున్నారు. ఈ మాఫియా కం టికి కినిపించిన గుట్టలు, భూములను తెల్లవారేసరికి పిండిపారేస్తున్నారు.
మట్టి మాఫియా కొత్త దందా
ప్రభుత్వ భూములు, గుట్టలే టార్గెట్‌గా పెట్టుకున్న మట్టి మాఫియా.. ప్ర స్తుతం సరికొత్త దందాకు తెర లేపింది. గతంలో ఎప్పటికప్పుడు గుట్టలనుంచి తవ్వి కావాల్సిన వారికి విక్రయించేవారు. ఇప్పుడు అక్రమార్కులు ‘రూటు’ మార్చారు. అర్ధరాత్రి సమయంలో వందల టిప్పర్లు, డంపర్లతో ముత్తగూడెం పరిధిలోని వెంచర్లలో, రాజీవ్‌స్వగృహ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో వేలాది ట్రిప్పుల మట్టిని డంప్ చేస్తున్నారు. ఈ మట్టి డంప్‌లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్కో డంప్‌లో వేలాది ట్రిప్పుల మట్టిని దాచిపెడుతున్నారు. ఈ డంప్‌లే చిన్నపాటి గుట్టలను తలపిస్తున్నాయి.
ఈ మట్టిని పగటిపూట ఖమ్మం, వరంగల్ క్రాస్‌రోడ్డుతో పాటు ఇతర ప్రాంతాల్లోని వెంచర్లు, ఇళ్లకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. సంబంధింత మైనింగ్ శాఖాధికారులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. మాఫి యా ఇచ్చే ముడుపులకు కక్కుర్తిపడి అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాఫియాతో ఎలాంటి ఒప్పందం లేకుంటే.. మైనింగ్ అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మైనింగ్ శాఖాధికారులు.. మట్టి మాఫియాపై దృష్టి సారించి, అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మట్టి తవ్వడం నేరం: మైనింగ్ ఏడీ సాయినాథ్
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా మట్టి తీయడం నేరం. అలాంటి మట్టిని డంపింగ్ చేయడం తప్పు. ప్రస్తుతం ఈ మట్టి తోలకాలు, డంపింగ్ వ్యవహారాలు దృష్టికి రాలేదు. వెంటనే వాటిని పరిశీలించి చట్టప రంగా చర్యలు తీసుకుంటాం.
ఈ వార్తలు కూడా చదవండి:
నీటి యుద్ధాలు రాకుండా ముందుగానే మేల్కొనాలి
వికారాబాద్ డిపోలో నిలిచిన అద్దె బస్సులు
Read Latest Telangana News and National News