Share News

పసిడి ధర.. మరింతగా పతనం!

ABN , Publish Date - Mar 24 , 2026 | 10:26 AM

నేడు బంగారం ధరలు మరింతగా తగ్గాయి. డాలర్ బలంగా ఉండటం, ప్రాఫిట్ బుకింగ్, ఫెడ్ వడ్డీ కోతపై తగ్గుతున్న ఆశలు పసిడి ధర పతనం అయ్యేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

పసిడి ధర.. మరింతగా పతనం!
Gold, Silver Prices In India on March 24

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో నేడు (మార్చి 24) కూడా బంగారం ధర తిరోగమనంలో పయనిస్తోంది. మేలిమి బంగారం ధర ఏకంగా రూ.2,940ల మేర పతనమైంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు) రూ.2,940ల మేర తగ్గి రూ.1,40,650కు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా రూ.2,700 మేర కోత పడింది. ప్రస్తుతం ధర రూ.1,28,650గా ఉంది. ఇక నగరంలో వెండి ధర కూడా రూ.10 వేల మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.4 లక్షల వద్ద ట్రేడవుతోంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్స్‌లో ప్రస్తుతం ఔన్స్ మేలిమి పసిడి స్పాట్ ధర 4,335 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్స్ వెండి 66 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్ బలపడటం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేటులో కోత ఉండదన్న అంచనాలు పసిడికి డిమాండ్ తగ్గేలా చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు కామెంట్ చేస్తున్నారు.


ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు, 22 క్యారెట్లు) ధరలు

  • చెన్నై: ₹1,41,820; ₹1,30,000;

  • ముంబై: ₹1,40,350; ₹1,28,650;

  • ఢిల్లీ: ₹1,40,500; ₹1,28,800;

  • కోల్‌కతా: ₹1,40,350; ₹1,28,650;

  • బెంగళూరు: ₹1,40,350; ₹1,28,650;

  • హైదరాబాద్: ₹1,40,350; ₹1,28,650;

  • విజయవాడ: ₹1,40,350; ₹1,28,650;

  • కేరళ: ₹1,40,350; ₹1,28,650;

  • పుణె: ₹1,40,350; ₹1,28,650;

  • వడోదరా: ₹1,40,400; ₹1,28,700;

  • అహ్మదాబాద్: ₹1,40,400; ₹1,28,700;

వెండి (కిలో) ధరలు

  • చెన్నై: ₹2,40,000

  • ముంబై: ₹2,35,000;

  • న్యూఢిల్లీ: ₹2,35,000

  • కోల్‌కతా: ₹2,35,000

  • బెంగళూరు: ₹2,35,000

  • హైదరాబాద్: ₹2,40,000

  • విజయవాడ: ₹2,40,000

  • కేరళ: ₹2,40,000

  • పుణె: ₹2,35,000

  • వడోదరా: ₹2,35,000

  • అహ్మదాబాద్: ₹2,35,000


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ఈ వార్తలూ చదవండి:

రూ.48 లక్షల కోట్లు.. పశ్చిమాసియా సంక్షోభంలో ఆవిరైన సంపద

యుద్ధ విరామం.. భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర

Updated Date - Mar 24 , 2026 | 12:42 PM