Share News

భారీ లాభాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Mar 24 , 2026 | 10:51 AM

నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ సూచీ ఏకంగా 1,500 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 22,900 మార్కు చేరువలోకి వెళ్లింది. పెట్టుబడిదారుల సంపద కొన్ని గంటల్లోనే లక్షల కోట్లు పెరిగిపోయింది.

భారీ లాభాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు
Indian Stock Markets Surge

ఆంధ్రజ్యోతి, మార్చి 24: నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తున్నాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ సూచీ ఏకంగా 1,500 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 22,900 మార్కు చేరువలోకి వెళ్లింది.


మార్కెట్ విజృంభణకు ప్రధాన కారణాలు:

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై ఐదు రోజులపాటు యద్ధం నిలిపివేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో చేకూరిన అంతర్జాతీయ సానుకూలతలు, అమెరికా మార్కెట్ల నుండి అందుతున్న అనుకూల సంకేతాలు, ఆపై.. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం మన మార్కెట్లకు కలిసొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం మన ఆర్థిక వ్యవస్థకు, రూపాయి విలువకు సానుకూలంగా మారింది. సానుకూల రాజకీయ పరిణామాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.

ఫలితంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకింగ్ షేర్లలో భారీ కొనుగోళ్లు మార్కెట్ సూచీలను పైకి నెట్టాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ భారత మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభించడం బుల్ రన్‌కు ప్రధాన కారణమైంది. కేవలం బ్యాంకింగ్ రంగమే కాకుండా, ఐటీ (IT), ఆటోమొబైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Health News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 11:02 AM