Share News

శ్రీసీతారాముల కళ్యాణోత్సవాన్ని నేరుగా వీక్షించండి ఇలా

ABN , Publish Date - Mar 07 , 2026 | 10:50 AM

భద్రాచలంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 27న జరిగే కళ్యాణోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీసీతారాముల కళ్యాణోత్సవాన్ని నేరుగా వీక్షించండి ఇలా
Bhadradri Temple

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 7: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సంవత్సరం మార్చి 27వ తేదీన శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని నేరుగా వీక్షించడానికి వివిధ సెక్టార్లకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయానికి ఉంచారు ఆలయ అధికారులు. దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ https://bhadradritemple.telangana.gov.in ద్వారా భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. టికెట్లు వివిధ ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి.


ఆఫ్‌లైన్‌లో దేవస్థానం కార్యాలయం, సి.ఆర్.ఓ ఆఫీస్, బ్రిడ్జి పాయింట్ సెంటర్, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులు త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. అలాగే, స్వామిఅమ్మవార్ల కళ్యాణ తలంబ్రాలను ఇంటికే డెలివరీ చేసే సౌకర్యం కూడా టీజీఎస్ఆర్టీసీ ద్వారా అందుబాటులో ఉండనుంది.


ఇవి కూడా చదవండి...

దుర్గమ్మ ఆలయంలో 50 లక్షల బంగారం మిస్సింగ్

మేము ఎలాంటి అపచారం చేయలేదు: దువ్వాడ శ్రీనివాస్, మాధురి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 07 , 2026 | 11:16 AM