జనసంద్రమైన వేములవాడ
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:57 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది.
కార్తీక సోమవారం పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు
వేములవాడ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. కార్తీక మాసం తొలి సోమవారం, కోటి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని భీమన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని పవిత్రస్నానాలను ఆచరించారు.
ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌లలో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. శ్రీస్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు భక్తులు కోడె మొక్కు క్యూలైన్‌లో సుమారుగా నాలుగు గంటల పాటు వేచి ఉన్నారు. ఆయా క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ భీమేశ్వర స్వామికి అభిషేకం చేసి తరించారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ముక్కోటి సోమవారం సందర్భంగా శ్రీభీమేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు ఒక లక్ష వరకు భక్తులు తరలివచ్చినట్లు ఆలయాధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News