Share News

కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవర్ల ఆందోళన.. డిపోలో నిలిచిపోయిన బస్సులు

ABN , Publish Date - May 11 , 2026 | 10:32 AM

మద్యం తాగారని ఆరోపిస్తూ పలువురు ఆర్టీసీ డ్రైవర్లను అధికారులు విధుల్లోకి తీసుకోలేదు. అందుకు నిరసనగా సోమవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవర్లు ధర్నాకు దిగారు.

కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవర్ల ఆందోళన.. డిపోలో నిలిచిపోయిన బస్సులు

మంచిర్యాల, మే11: మద్యం తాగారని ఆరోపిస్తూ పలువురు ఆర్టీసీ డ్రైవర్లను అధికారులు విధుల్లోకి తీసుకోలేదు. అందుకు నిరసనగా సోమవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి డ్రైవర్లు ధర్నాకు దిగారు. తాము మద్యం సేవించకున్నా.. బ్రీత్ ఎనలైజర్ మందు తాగినట్లు చూపిస్తుందని డ్రైవర్లు ఆరోపించారు. బ్రీతింగ్ ఎనలైజర్ మిషన్ మార్చాలంటూ ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులను డ్రైవర్లు డిమాండ్ చేశారు. పాత యంత్రంతో పరీక్షించి తమను వేధిస్తున్నారంటూ ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.


వీరికి ఆర్టీసీ జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. డిపో మేనేజర్‌తోపాటు పోలీస్ అధికారులతో ఆర్టీసీ డ్రైవర్లు చర్చ జరుపుతున్నారు. మరో వైపు బ్రీత్ ఎనలైజర్ మిషన్ సక్రమంగానే పని చేస్తుందని ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో.. డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులు లేకపోవడంతో.. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో మంచిర్యాల బస్టాండ్‌ కిటకిటలాడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కడప అల్మాస్‌పేట సర్కిల్‌ ఘటనపై అధికారులు సీరియస్..

మోదీ రాక.. మరిచిపోలేని జ్ఞాపకం: నారా భువనేశ్వరి

For More TG News And Telugu News

Updated Date - May 11 , 2026 | 11:48 AM