Share News

పెద్దపల్లిలో ఉగ్ర లింకుల కలకలం.. ఎన్‌ఐఏ అదుపులో ఇంజినీరింగ్ విద్యార్థి

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:11 PM

పెద్దపల్లిలోని రామగుండంలో ఎన్ఐఏ నిర్వహించిన తనిఖీల్లో ఉగ్ర లింకులు బయటపడ్డాయి. ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి టెర్రరిస్ట్ గ్రూప్‌లతో సంబంధాలున్నట్టు సమాచారం.

పెద్దపల్లిలో ఉగ్ర లింకుల కలకలం.. ఎన్‌ఐఏ అదుపులో ఇంజినీరింగ్ విద్యార్థి
Peddapalli NIA raids

పెద్దపల్లి, ఆగస్టు 24: పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఉగ్ర లింకులు కలకలం రేపాయి. అయోధ్య నగర్‌లో నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) తనిఖీల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో రామగుండానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్‌ను NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముజామిల్ ఖాన్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ముజామిల్‌ను ఎన్‌ఐఏ అధికారులు.. ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులతో విద్యార్థికి ఎలాంటి లింకులు ఉన్నాయి, పరిచయాలు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.


మూడేళ్ల క్రితం కూడా కరీంనగర్‌లో ఉగ్రలింక్‌లు బయటపడిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ జగిత్యాలకు చెందిన వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి రామగుండంలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించడం, సోదాలు నిర్వహించడం సంచలనం రేపుతోంది.


ఇవి కూడా చదవండి...

తిరుపతిలో బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి

ఈగల్ శాఖలో ఇంటి దొంగల బాగోతం.. డ్రగ్స్ పెడ్లర్లతో కలిసి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 12:57 PM