ఈగల్ శాఖలో ఇంటి దొంగల బాగోతం.. డ్రగ్స్ పెడ్లర్లతో కలిసి
ABN , Publish Date - Aug 24 , 2026 | 09:54 AM
డ్రగ్స్ నిర్మూలన కోసం పనిచేసే ఈగల్ శాఖలోనే ఇద్దరు కానిస్టేబుల్స్ డ్రగ్స్ దందాకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈగల్ ఇంటి దొంగలైన కానిస్టేబుల్ నరహరి, స్వామిలపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, ఆగస్టు 24: డ్రగ్స్ నిర్మూలన కోసం పనిచేసే ఈగల్ శాఖలోనే ఇద్దరు కానిస్టేబుల్స్ డ్రగ్స్ దందాకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈగల్ ఇంటి దొంగలైన కానిస్టేబుల్ నరహరి, స్వామిలపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.50 లక్షలు విలువైన ఎక్ట్ససీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్స్.. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు ఇవ్వనట్లు తెలుస్తోంది. 50 లక్షల విలువైన ఒక కిలో ఎక్ట్ససీ మాత్రలను అక్రమంగా విక్రయించేందుకు వీరిద్దరూ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఏకంగా డ్రగ్ పెడ్లర్లను సంప్రదించినట్లు సమాచారం.
ఒక డ్రగ్ పెడ్లర్‌ను పట్టుకునేందుకు హెచ్‌న్యూ అధికారులు చేపట్టిన ఆపరేషన్‌లో.. కానిస్టేబుళ్లు నరహరి, స్వామిల బాగోతం బట్టబయలైంది. గతంలో వీరిద్దరూ పలు విజయవంతమైన యాంటీ డ్రగ్స్ ఆపరేషన్స్ చేసి అవార్డులు కూడా అందుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈగల్ టీం.. ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి దూరం పెట్టినట్లు తెలుస్తోంది. నరహరి, స్వామిలపై అంతర్గతంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. డ్రగ్స్ పెడ్లర్లతో వీరికి ఉన్న సంబంధాలు, ఎక్ట్ససీ మాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈగల్ శాఖలో మరెవరైనా ఇందులో భాగస్వాములై ఉన్నారా అనే కోణంలో ఈగల్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వరంగల్‌లో 120 కిలోల గంజాయి పట్టివేత
వరంగల్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 120 కిలోల గంజాయిని కారులో రవాణా చేస్తున్న ఇద్దరిని వర్ధన్నపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గంజాయిని ఒడిశా నుంచి కేరళంకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిని గంజాయి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులు రవాణాకు ఉపయోగించిన కారు త్రిపుర రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. గంజాయి రవాణాకు ఇంకెవరైనా సహకరించారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువుల సజీవ దహనం..
తిరుపతిలో బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి
Read Latest Telangana News And Telugu News