ఏఈ నూకరాజు మనవడికి అండగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
ABN , Publish Date - Aug 24 , 2026 | 09:23 AM
కుటుంబాన్ని కోల్పోయిన ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డికి మాజీ ఎంపీ అండగా నిలిచారు. రాజమండ్రికి చేరుకున్న మాజీ ఎంపీ రావులపాలెంలో ఉన్న పదేళ్ల రియాన్ష్ రెడ్డి వద్దకు వెళ్లనున్నారు.
రాజమండ్రి, ఆగస్టు 24: కుటుంబాన్ని కోల్పోయిన ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డికి మాజీ ఎంపీ అండగా నిలిచారు. రాజమండ్రికి చేరుకున్న మాజీ ఎంపీ రావులపాలెంలో ఉన్న పదేళ్ల రియాన్ష్ రెడ్డి వద్దకు వెళ్లనున్నారు. ఈనెల 16న పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ నూకరాజు కుటుంబంతో సహా రాజమండ్రి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో నూకరాజు, భార్య మీనా, కుమార్తె సౌజన్య ప్రాణాలు కోల్పోయారు.
అయితే, ఈత వచ్చిన కారణంగా గోదావరి నుంచి మనవడు రియాన్ష్ కార్తికేయరెడ్డి మృత్యుంజయుడుగా బయటపడ్డాడు. వీరి ఆత్మహత్యకు కారణమై పరారీలో ఉన్న షేక్ సాధిక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కాకినాడకు తీసుకొచ్చారు. కార్తికేయరెడ్డి తల్లి సౌజన్యను షేక్ సాధిక్ దారుణంగా వేధింపులకు గురిచేశాడు. ఈ కారణంగానే ఏఈ నూకరాజు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది.
ఇవి కూడా చదవండి...
ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువుల సజీవ దహనం..
తిరుపతిలో బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి
Read Latest AP News And Telugu News