అమరావతి ఛాంపియన్‌షిప్ 2026.. తిరుపతిలో పోటీలను ప్రారంభించిన మంత్రులు
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:17 AM
తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈరోజు(సోమవారం) ఉదయం ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్‌లో హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ పోటీలను ప్రారంభించారు.
తిరుపతి, ఆగస్టు 24: తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్ 2026 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈరోజు(సోమవారం) ఉదయం ఎస్వీ యూనివర్సిటీ తారకరామా గ్రౌండ్స్‌లో హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారికి క్రమశిక్షణ కీలమైందన్నారు. క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో రానిస్తారని తెలిపారు. ఇప్పుడు క్రీడాకారులుగా ఉన్న వారిలో ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యేవారు ఉంటారని చెప్పారు. క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. మట్టిలో మాణిక్యాలను తీసుకురావటానికి కృషి చేస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హోం మంత్రి అనిత ధన్యవాదాలు తెలియజేశారు.
కూటమి పాలనలో క్రీడలకు స్వర్ణయుగం: శాప్ ఛైర్మన్
వైసీపీకి క్రీడాకారులంటే చిన్నచూపని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. క్రీడాకారులకు ఉద్యోగాలు ఇస్తే వద్దని అంటున్నారని మండిపడ్డారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెడితే తప్పు పడుతున్నారని విమర్శించారు. వారు పాలనలో ఉన్నప్పుడు ఏనాడు ఎవరినీ ఆడించలేదని దుయ్యబడ్డారు. కూటమి పాలనలో క్రీడలకు స్వర్ణయుగమని రవినాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏఈ నూకరాజు మనవడికి అండగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
గుర్రాల బీచ్ వద్ద యువకుల గల్లంతుపై పవన్ కల్యాణ్ ఆందోళన
Read Latest AP News And Telugu News