Share News

గుర్రాల బీచ్‌ వద్ద యువకుల గల్లంతుపై పవన్ కల్యాణ్ ఆందోళన

ABN , Publish Date - Aug 24 , 2026 | 10:49 AM

కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతి కారణంగా ఇద్దరు యువకులు గల్లంతవడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు.

గుర్రాల బీచ్‌ వద్ద యువకుల గల్లంతుపై పవన్ కల్యాణ్ ఆందోళన
Deputy CM Pawan Kalyan

అమరావతి, ఆగస్టు 24: కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతి కారణంగా ఇద్దరు యువకుల గల్లంతుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువకుల గల్లంతుపై సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పవన్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ నుంచి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలు, మెరైన్ పోలీసు, కోస్టు గార్డుతో పాటు స్థానిక మత్స్యకార సమూహాల సహకారాన్ని కూడా తీసుకోవాలని సూచించారు. వారి కుటుంబాలకు అందుబాటులో ఉంటూ, ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీకి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.


నిన్న(ఆదివారం) నలుగురు స్నేహితులు వీరబాబు, శ్రీగణేష్ సాయిరాం, యువ కిశోర్, ఆదిత్య వెంకట సందీప్‌కుమార్ కలిసి కాకినాడాలోని గుర్రాల బీచ్‌కు వెళ్లారు. ఎవరూ లేని ప్రదేశంలో నలుగురు కలిసి సముద్రంలో స్నానానికి వెళ్లగా అలల ఉధృతికి యువ కిశోర్, వీరబాబు గల్లంతయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన ఇద్దరికి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

తిరుపతిలో బాలికపై బ్లేడ్ బ్యాచ్ విచక్షణారహితంగా దాడి

ఏఈ నూకరాజు మనవడికి అండగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 11:06 AM