బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే వదిలిపెట్టం.. కేటీఆర్ వార్నింగ్
ABN , Publish Date - Jul 21 , 2026 | 02:38 PM
బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వాళ్లను వదిలిపెట్టేది లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నవారిని ఒక్కరిని కూడా వదలమని స్పష్టం చేశారు.
మంచిర్యాల, జులై 21: బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిని వదిలిపెట్టేది లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నవారిని ఒక్కరిని కూడా వదలమని ఆయన స్పష్టం చేశారు. అతి చేస్తున్న అధికారులు. రిటైర్డ్ అయినా తర్వాత కూడా గుంజుకొచ్చి ప్రజల ముందు నిలబెడతామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులను క్షోభ పెడితే వదిలిపెట్టమని పేర్కొన్నారు. తాను కేసీఆర్‌లా మంచోడిని కాదని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలంటూ మంచిర్యాల ఎమ్మెల్యేకు ఆయన హితవు పలికారు. మంగళవారం మంచిర్యాలలో కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు రావొద్దనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని గుర్తు చేశారు.
31 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేయలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాల్సిన ఎల్ అండ్ టీ సంస్థను కూడా బెదిరించారని ఆరోపించారు. గోదావరి నది ఏపీకి తరలుతోంది.. అక్కడ పట్టిసీమ పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలిసింది రెండేనని.. ఒకటి ఓట్లు, రెండోది తిట్లు అని వ్యంగ్యంగా అన్నారు. ఏం జాతి మీది అని సీఎం రేవంత్ రెడ్డి తరచూ అంటున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో ఉన్నవి రెండే జాతులని వివరించారు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి.. రెండోది ద్వేషించే జాతి అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు.. విద్యార్థులపై దాడి అమానుషం: రాహుల్ గాంధీ
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
For More TG News And Telugu News