ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు.. విద్యార్థులపై దాడి అమానుషం: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Jul 21 , 2026 | 01:39 PM
ఢిల్లీలో సీజేపీమార్చ్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను కాంగ్రెస్ అగ్రనాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో సీజేపీ (CJP) మార్చ్ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను కాంగ్రెస్ అగ్రనాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. పోలీసుల లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగంలో గాయపడిన విద్యార్థులను రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కలిసి పరామర్శించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది (Rahul Gandhi about CJP march).
పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్య గురించి ప్రధాని మోదీ ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరమన్నారు. విద్యార్థులపై జరిగిన ఘటనకు ప్రధాని క్షమాపణ చెప్పాలని, ఇలాంటి చర్యలు వెంటనే ఆగాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఈ ఘటనపై అత్యవసర చర్చ నిర్వహించాలని కోరారు (Delhi student protest).
పోలీసు చర్యలో గాయపడిన విద్యార్థులు చికిత్స పొందుతున్న రామ్ మనోహర్ లోహియా (RML) ఆసుపత్రికి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వెళ్లి వారిని పరామర్శించనున్నారు. విద్యార్థుల గొంతును అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించబోదని రాహుల్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం, పోలీసు చర్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సోమవారం జరిగిన సీజేపీ మార్చ్ సందర్భంగా వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 100 మందికి పైగా పోలీసులు, 60 మందికి పైగా నిరసనకారులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నేపాల్ రూపాయి డిజైన్ మార్పు.. భారత భూభాగాల తొలగింపు..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..