Share News

వృద్ధ మహిళలే లక్ష్యంగా దోపిడీ, హత్యలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:27 AM

ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని నగల కోసం హత్యలకు పాల్పడిన ముఠా గుట్టును కరీంనగర్‌ పోలీసులు రట్టు చేశారు.

వృద్ధ మహిళలే లక్ష్యంగా దోపిడీ, హత్యలు
Karimnagar Double Murder

  • నగల కోసం రెండు చోట్ల ఇద్దరు వృద్ధురాళ్ల హత్య

  • నలుగురి అరెస్టు.. మరో నిందితుడు పరారీ

కరీంనగర్‌ క్రైం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని నగల కోసం హత్యలకు పాల్పడిన ముఠా గుట్టును కరీంనగర్‌ పోలీసులు రట్టు చేశారు. తిమ్మాపూర్‌ మండలం వచ్చునూరు గ్రామంలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వృద్ధురాళ్లను ఊపిరాడకుండా చేసి హతమార్చి, వారి ఒంటిపై ఉన్న ఆభరణాలను దోచుకెళ్లిన కేసుల్లో నలుగురు నిందితులను శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆభరణాలు, సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ వివరాలను కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 16న వచ్చునూర్‌కు చెందిన ఉప్పులేటి భూదమ్మ (103) ఇంట్లోకి చొరబడిన మద్దూరి సాయి తన సహచరులతో కలిసి ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకెళ్లారు.


ఆ నగలను మరో నిందితుడు పవన్‌ సహాయంతో మణికంఠకు విక్రయించి, వచ్చిన డబ్బును పంచుకున్నారు. భూదమ్మ వృద్ధాప్యం కారణంగా మరణించిందని భావించిన కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అక్టోబరు 31న ఉప్పులేటి లక్ష్మి అలియాస్‌ లచ్చవ్వ (80) ఇంట్లోకి చొరబడి ఆమెను కూడా ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం ఆమె వద్ద ఉన్న వెండి కడియాలు, బంగారు నల్లపూసల గొలుసు, చెవికమ్మలను అపహరించారు. వీటిలో కొన్నింటిని కరీంనగర్‌లో, మరి కొన్నింటిని హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో విక్రయించారు. పోలీసు విచారణలో రెండు హత్యల వెనుక ఒకే ముఠా ఉన్నట్లు గుర్తించారు. నిందితులు మద్దూరి సాయి, కిన్నెర రాజు, ఎల్కతుర్తి రాజు, పవన్‌కుమార్‌ అలియాస్‌ జాక్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు కనపర్తి మణికంఠ కోసం గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అతివేగం మిగిల్చిన విషాదం!

గంజాయి లేడీ డాన్‌ నిత్తూ చిక్కింది

ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 04:27 AM