Share News

కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడే సెస్‌లో రూ.32 కోట్ల అవినీతి

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:48 AM

సిరిసిల్ల ప్రాంతంలోని కోఆపరేటివ్‌ ఎలక్ర్టిక్‌ సప్లై సొసైటీ లిమిటెడ్‌ను(సెస్‌) రద్దు చేయడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, కేటీఆర్‌ మంత్రిగా ఉన్న సమయంలో సెస్‌లో రూ.32కోట్ల మేర అవినీతి జరిగిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

కేటీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడే సెస్‌లో రూ.32 కోట్ల అవినీతి
Kalvakuntla Kavitha

  • ఎన్నికల ముందు ఆ ఫైళ్లన్నీ దగ్ధం

  • గల్ఫ్‌ కార్మికులకు గత సర్కార్‌ ఏం చేయలేదు

  • రాజన్న ఆలయాన్ని సిమెంట్‌తో ఎలా నిర్మిస్తారు?

  • కృష్ణ శిలలతోనే పునర్నిర్మించాలి

  • రేవంత్‌, మహేశ్‌గౌడ్‌ది ఇడుపుకాయితం జోడీ: కవిత

సిరిసిల్ల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల ప్రాంతంలోని కోఆపరేటివ్‌ ఎలక్ర్టిక్‌ సప్లై సొసైటీ లిమిటెడ్‌ను(సెస్‌) రద్దు చేయడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, కేటీఆర్‌ మంత్రిగా ఉన్న సమయంలో సెస్‌లో రూ.32కోట్ల మేర అవినీతి జరిగిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు అందులో అగ్నిప్రమాదం జరిగి ఆ ఫైళ్లన్నీ కాలిపోయాయని, ఇలా చాలాచోట్ల ఆధారాలు మాయం చేశారని విమర్శించారు. సెస్‌లో జరిగిన అవినీతిపై వి చారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు అందజేసిన కవిత.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చందుర్తి మండలం సనుగులలో అమరవీరుల యాది కార్యక్రమంలో పాల్గొన్నారు.


అనంతరం ఆమె మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర ఉన్న వేములవాడ రాజన్న ఆలయాన్ని సిమెం ట్‌తో ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. వెయ్యేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండే లా కృష్ణ శిలలతో ఆగమశాస్రాన్ని అనుసరించి ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరారు. బండి సంజయ్‌ కేంద్ర మంత్రిగా ఉండి కూడా ప్రసాద్‌ స్కీమ్‌లో వేములవాడ ఆలయాన్ని చేర్చలేదని ధ్వజమెత్తారు. యువ సామ్రాట్‌ అని చెప్పుకునే కేటీఆర్‌ నియోజకవర్గంలో ఉన్న జేఎన్టీయూ కాలేజీలో ల్యాబ్‌ లేక విద్యార్థులు జగిత్యాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.


నాలుగు నెలల్లో రుద్రంగి రిజర్వాయర్‌ను పూర్తి చేస్తానని చెప్పిన హరీశ్‌.. పదేళ్లయినా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని దుయ్యబట్టారు. సిరిసిల్లలో సభ పెట్టి గాయిగాయి చేయడం తప్ప సీఎం చేసిందేముందని నిలదీశారు. సిరిసిల్లలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎం చెప్పడంపై స్పందిస్తూ పదేళ్లుగా సిరిసిల్లకు మంత్రి లేరా?ముఖ్యమంత్రే సిరిసిల్లకు మంచి చేయలేరా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే, టీపీసీసీ అధ్యక్షుడు ఇంకొకటి మాట్లాడతారని, వాళ్లను చూస్తే ఇడుపుకా యితం జోడీలా కనిపిస్తోందని ధ్వజమెత్తారు.


ఇవి కూడా చదవండి...
ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపడం తగదు!

రాజ్యాంగం పట్టుకొని రాహుల్‌ ఉపన్యాసాలు

గౌరవం లేని చోట ఉండలేను
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 05:48 AM