Share News

రాజ్యాంగం పట్టుకొని రాహుల్‌ ఉపన్యాసాలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:28 AM

ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని రాహుల్‌గాంధీ.. ఉపన్యాసాలు దంచుతుండగా, తెలంగాణలో ఆయన తొత్తు రేవంత్‌రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

రాజ్యాంగం పట్టుకొని రాహుల్‌ ఉపన్యాసాలు
KTR

  • తెలంగాణలో రేవంత్‌రెడ్డి అరాచక పాలన: కేటీఆర్‌

ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని రాహుల్‌గాంధీ.. ఉపన్యాసాలు దంచుతుండగా, తెలంగాణలో ఆయన తొత్తు రేవంత్‌రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఎవరిపైనైనా రాహుల్‌గాంధీ నిరాధార ఆరోపణలు చేయొచ్చు కానీ, ఆధారాలతో ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌ను జైలుకు పంపుతారా? అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.


అనుముల కుటుంబ అవినీతిని ఆధారాలతో ప్రశ్నించినందుకే క్రిశాంక్‌ను అరెస్టు చేయించారని ఆరోపించారు. గల్లీల్లో తిరుగుతూ ‘ఓటు చోరీ’ అని అరిచే రాహుల్‌.. తెలంగాణలో ఓటుకు నోటు సూత్రధారికే ముఖ్యమంత్రి కుర్చీ కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రేవంత్‌ను అదుపులో పెట్టాలని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం మానుకోవాలని రాహుల్‌కు సూచించారు.


ఇవి కూడా చదవండి...
ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపడం తగదు!

‘కరెంట్‌ కొంటాం.. అనుమతించండి’

15 రోజుల్లో డిపెండెంట్‌ ఆర్డర్లు!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 05:29 AM