ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపడం తగదు!
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:25 AM
దసరా, దీపావళి సమయంలో ప్రజలకు శుభవార్త చెప్పాల్సిన ప్రభుత్వం.. విద్యుత్తు బిల్లుల రూపంలో భారం మోపుతోందని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు పేర్కొన్నారు.
ట్రూఅప్ చార్జీల పేరుతో రూ.5,420 కోట్లు
మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం: హరీశ్
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దసరా, దీపావళి సమయంలో ప్రజలకు శుభవార్త చెప్పాల్సిన ప్రభుత్వం.. విద్యుత్తు బిల్లుల రూపంలో భారం మోపుతోందని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు పేర్కొన్నారు. ట్రూఅప్ చార్జీల పేరుతో రూ.5,420 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపేందుకు ప్రభుత్వం సిద్థమవుతోందని పేర్కొన్నారు. విద్యుత్తు కొనుగోళ్లకు వెచ్చించిన మొత్తాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేయడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలి? అని ప్రశ్నించారు.
ఇప్పటికే విద్యుత్తు కోతలతో అల్లాడుతున్న ప్రజలపై భారం మోపడం సరికాదని, ట్రూ అప్ చార్జీల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు సంక్షోభానికి ఎల్‌నినో వంటి కారణాలను చూపించడం సరికాదన్నారు. భద్రాద్రి, యాదాద్రి, సింగరేణి థర్మల్ కేటీపీఎస్ వంటి విద్యుత్తు కేంద్రాలను సమర్థంగా నడపడం లేదని ఆరోపించారు. కాగా రూ.5,420 కోట్ల విద్యుత్తు భారాన్ని ప్రజలపై మోపే నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు.
ఇవి కూడా చదవండి...
గ్రామాల్లో ప్రపంచస్థాయి విద్య
‘కరెంట్ కొంటాం.. అనుమతించండి’
15 రోజుల్లో డిపెండెంట్ ఆర్డర్లు!
Read Latest AP News And Telugu News