Share News

గౌరవం లేని చోట ఉండలేను

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:41 AM

‘‘సీనియర్‌ నాయకుడినని కూడా చూడలేదు. ఎన్నో రకాలుగా అవమానించారు. గౌరవం లేని చోట ఉండే కంటే పార్టీని వీడటమే మేలని భావిస్తున్నా.

గౌరవం లేని చోట ఉండలేను
Thati Venkateshwarlu

  • ఉంటే ఉండు.. పోతే పో అంటూ..

  • బీఆర్‌ఎస్‌ సమావేశంలోనే అవమానించారు

  • మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆవేదన

అశ్వారావుపేట, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘‘సీనియర్‌ నాయకుడినని కూడా చూడలేదు. ఎన్నో రకాలుగా అవమానించారు. గౌరవం లేని చోట ఉండే కంటే పార్టీని వీడటమే మేలని భావిస్తున్నా. త్వరలోనే నా అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి.. నా రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తా. మంగళవారం కొత్తగూడెంలో బీఆర్‌ఎస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం కోసం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో సీనియర్‌ నాయకుడునైన నాపట్ల కనీస గౌరవం లేకుండా అవమానించారు. నన్ను కనీసం వేదికపైకి పిలవలేదు. దానిపై ప్రశ్నిస్తే ఉంటే ఉండు.. లేకుంటే పో అని అవమానకరంగా మాట్లాడారు’’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తాటి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అశ్వారావుపేటకు చెందిన మీడియా ప్రతినిధులకు ఫోన్‌ చేసి తనకు జరిగిన అవమానం గురించి తెలిపారు.


ఇవి కూడా చదవండి...
ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపడం తగదు!

రాజ్యాంగం పట్టుకొని రాహుల్‌ ఉపన్యాసాలు

ఈసీల నియామక ప్రక్రియను రద్దు చేయాలి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 05:41 AM