Share News

ఈసీల నియామక ప్రక్రియను రద్దు చేయాలి

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:35 AM

భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌, కమిషనర్ల నియామక ప్రక్రియలో వెంటనే మార్పులు చేయాలని, ఈ కమిటీలో మునుపటి మాదిరిగా ..

ఈసీల నియామక ప్రక్రియను రద్దు చేయాలి
Asaduddin Owaisi

  • మళ్లీ కమిటీలో సీజేఐకి చోటు కల్పించాలి

  • రాష్ట్రంలో ముస్లిం ఓటర్లను తొలగించే కుట్ర: ఒవైసీ

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌, కమిషనర్ల నియామక ప్రక్రియలో వెంటనే మార్పులు చేయాలని, ఈ కమిటీలో మునుపటి మాదిరిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, విపక్ష నేతలను భాగస్వాములు చేయాలని మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. దేశంలో మళ్లీ ప్రజలను రోడ్లమీదకు తీసుకురావడానికి వీలుగా ఎన్‌ఆర్‌సీ తేవాలని ఆర్‌ఎ్‌సఎస్‌ కోరుతోందని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌తో దేశంలో 10 కోట్ల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆక్షేపించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డిని కలిసి ఒవైసీ వినతిపత్రాన్ని అందించారు.


గోషామహల్‌ నియోజకవర్గంలో 122 మంది ముస్లింల ఓట్లు తొలగించాలని ముద్రిత ఫామ్‌-7 పత్రాలను బీజేపీ కార్యకర్త ఒకరు సమర్పించారని, అక్కడి బీఎల్‌వో తిరస్కరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ముస్లింలపై ఎందుకు ఈ ద్వేషమని బీజేపీని ప్రశ్నించారు. కాగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలో ఎందుకు భాగస్వాములు కావడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. ఇండి కూటమిలో మజ్లిస్‌ భాగస్వామిని కాదని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...
ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపడం తగదు!

రాజ్యాంగం పట్టుకొని రాహుల్‌ ఉపన్యాసాలు

15 రోజుల్లో డిపెండెంట్‌ ఆర్డర్లు!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 05:35 AM