సీటు కోసం సిగపట్లు!
ABN , Publish Date - Sep 14 , 2026 | 04:56 AM
వికారాబాద్ జిల్లా పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా ఘర్షణకు దారితీయడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆర్టీసీ బస్సులో మహిళల కొట్లాట
పరిగి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు సిగపట్లు పట్టారు. ఇద్దరు మహిళల మధ్య జరిగిన స్వల్ప వాగ్వాదం కొట్లాటకు దారి తీసింది. వికారాబాద్ జిల్లా పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో శనివారం ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఒక మహిళ మరో మహిళపై చేయి చేసుకోవడంతో ఆమెపై మరో ముగ్గురు మహిళలు దాడి చేశారు. దీంతో వివాదం తార స్థాయికి చేరింది. బస్సులో ప్రయాణిస్తున్న తోటి మహిళలు వారిని శాంతింపజేసేందుకు యత్నించినా లాభం లేకపోయింది. చివరకు డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి కొట్లాడుతున్న మహిళల్ని బెదిరించడంతో ఘర్షణ సద్దుమణిగింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
చరిత్రను తొక్కిపెడుతున్నారు
పాత పెన్షన్ పునరుద్ధరిస్తేనే అధికారం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News