కాంప్రమైజ్ లెటర్ రాసిచ్చారు.. అందుకే కేసు నమోదు చేయలేదు: వికారాబాద్ ఎస్సై
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:36 PM
వికారాబాద్ జిల్లాలో మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఎస్సై నిందితులపై కేసు నమోదు చేయలేదని స్థానికులు, ప్రజాసంఘాలు నిరసనలు తెలిపిన నేపథ్యంలో దోమ పోలీస్ స్టేషన్ ఎస్సై వసంత్ జాదవ్ స్పందించారు.
వికారాబాద్, సెప్టెంబర్ 22: మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో ఎస్సై నిందితులపై కేసు నమోదు చేయడంలేదని స్థానికులు, ప్రజాసంఘాలు నిరసనలు తెలిపిన నేపథ్యంలో దోమ పోలీస్ స్టేషన్ ఎస్సై వసంత్ జాదవ్ స్పందించారు.
స్థానికులు, ప్రజాసంఘాలు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్సై వసంత్ దిద్దుబాటు చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మైనర్ల వ్యవహారానికి సంబంధించి కంప్లైంట్ వచ్చిందన్న మాట వాస్తవమేనని ఎట్టకేలకు ఎస్సై ఒప్పుకున్నారు. బాధితులు, నిందితుల తరఫు వారు కాంప్రమైజ్ అయినట్లు లెటర్ రాసిచ్చినందుకే తాను కేసు నమోదు చేయలేదని తెలిపారు. బాధితురాలు, నిందితులు మైనర్లు కావడంతో కాంప్రమైజ్ చేశానని బుకాయించారు. ఈ మేరకు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఒత్తిడితో ఎస్సై వసంత్.. బాధితులు, నిందితులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఈ నేపథ్యంలో నిందితులపై కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా.. దోమ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న వసంత్ జాదవ్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలోనూ చాలా కేసుల్లో ఎస్సై ఈ విధంగానే చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శుక్రవారం మధ్యాహ్నం లోపే ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం
యువ వికాసంపై చిగురిస్తున్న ఆశలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News