Share News

విజయ్ దేవరకొండ, రష్మికపై ఫేక్ ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!

ABN , Publish Date - Oct 26 , 2026 | 08:26 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వారి టీం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'కాఫీ విత్ కరణ్' షోలో విజయ్, రష్మిక వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

విజయ్ దేవరకొండ, రష్మికపై ఫేక్ ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు!
Vijay Rashmika

ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వారి టీం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'కాఫీ విత్ కరణ్' షోలో విజయ్, రష్మిక వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగా కల్పిత వ్యాఖ్యలు, నకిలీ స్క్రీన్‌షాట్లను ప్రచారం చేస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విరోష్ టీం పోలీసులను కోరింది. ఈ దుష్ప్రచారం ఇబ్బందులు కలుగజేసిందని వారి మేనేజర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.


ఇద్దరి వ్యక్తిగత జీవితంపై బ్రేకప్, విడాకులంటూ నిరాధార ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వేధింపులు, ఇతరుల పేరుతో నకిలీ ఖాతాల ద్వారా ప్రచారం చేస్తున్నారనే అంశాలపైనా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజయ్, రష్మికల టీమ్ ఫిర్యాదులో పేర్కొంది. ఫేక్ పోస్టులకు సంబంధించిన లింకులు, ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు విరోష్ టీంకి హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..

పాక్ గడ్డపై డకెట్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లాండ్ బ్యాటర్..!

రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి అరెస్ట్!

Updated Date - Oct 26 , 2026 | 08:54 PM