Share News

ఉప్పల్ దసరా వేడుకల్లో పాలపిట్ట విడుదల.. కేసు నమోదు చేసిన అటవీ శాఖ

ABN , Publish Date - Oct 21 , 2026 | 10:04 PM

దసరా ఉత్సవాల నేపథ్యంలో ఉప్పల్ మినీ స్టేడియంలో పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఉప్పల్ దసరా వేడుకల్లో పాలపిట్ట విడుదల.. కేసు నమోదు చేసిన అటవీ శాఖ
uppal dussehra bird release forest case

హైదరాబాద్, అక్టోబర్ 21: విజయదశమి సందర్భంగా ఉప్పల్ మినీ స్టేడియంలో జరిగిన ఉత్సవాల్లో పాలపిట్టలను విడుదల చేయడం కలకలం రేపింది. రాష్ట్రపక్షి అయిన పాలపిట్టను బంధించడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఉప్పల్‌కు చెందిన ఈగ చంద్రశేఖర్, పి. పరమేశ్వర్ అనే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే పాలపిట్టను బంధించి ఆపై వేడుకల్లో విడుదల చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని.. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. విచారణ పూర్తయ్యాక చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. స్టేడియంలో నిర్వహిస్తున్న వేడుకల్లో పాలపిట్టను విడుదల చేసిన వీడియో వైరల్ కావడంతో.. స్పందించిన అటవీ శాఖ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

మూడు ఫార్మాట్లలో ఆడుతా.. నాపై ఆ ముద్ర వేయకండి: ప్రియాంశ్ ఆర్య

ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి అమిత్ మిశ్రా.. గంగూలీ, యువీలతో పాటు..!

Updated Date - Oct 21 , 2026 | 10:04 PM