మూడు ఫార్మాట్లలో ఆడుతా.. నాపై ఆ ముద్ర వేయకండి: ప్రియాంశ్ ఆర్య
ABN , Publish Date - Oct 21 , 2026 | 07:16 PM
ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య.. తాను కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం కాదని నిరూపించాడు. గుజరాత్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 199 పరుగులు చేసి సత్తాచాటాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య.. తాను కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం కాదని నిరూపించాడు. గుజరాత్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 199 పరుగులు చేసి సత్తాచాటాడు. తన కెరీర్‌లో మూడో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడుతున్న ఆర్య.. 221 బంతుల్లో 24 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 199 పరుగులు సాధించాడు. కేవలం ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో అతడికిదే తొలి సెంచరీ.
‘నేను మూడు ఫార్మాట్లలోనూ ఆడగలనని నమ్ముతున్నా. వైట్‌బాల్ క్రికెట్‌లో నా ఆటను చూసినవారు నన్ను అలా గుర్తిస్తున్నారు. కానీ అండర్-19, అండర్-23 టోర్నీల్లోనూ రెడ్‌బాల్ క్రికెట్ ఆడాను. అన్ని ఫార్మాట్లలోనూ రాణించగలననే నమ్మకం నాకుంది. ఒకటే ఫార్మాట్‌లో ఆడే ప్లేయర్ అనే ముద్ర మాత్రం నాపై వేయకండి’ అని ప్రియాంశ్ ఆర్య వెల్లడించాడు.
ఆత్మవిశ్వాసమే బలం
ఇటీవల ఇండియా-ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అనుభవం తనకు ఎంతో ఉపయోగపడిందని ఆర్య తెలిపాడు. ‘గతంలో అప్పుడప్పుడు సందేహాలు వచ్చేవి. ఇప్పుడు నా సామర్థ్యంపై నమ్మకం పెరిగింది. మనసులో సానుకూల ఆలోచనలు ఉంటే క్రికెట్‌లోనూ మెరుగ్గా రాణించగలం. మనపై మనకు నమ్మకం ఉంటే ఏ ఫార్మాట్‌లోనైనా ఆడగలం. డబుల్ సెంచరీ మిస్ అయిందనే బాధ ఏమీ లేదు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానికే ప్రాధాన్యం ఇస్తా. ఎన్ని పరుగులు చేశామన్నది ముఖ్యం కాదు. జట్టును గెలిపించడమే నా లక్ష్యం’ అని ప్రిశాంశ్ ఆర్య వివరించాడు.
ఇవి కూడా చదవండి:
బుమ్రా కాదు.. భువీ బౌలింగ్ అత్యంత ప్రమాదకరం: కివీస్ మాజీ క్రికెటర్
పారా ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. ఖాతాలో 54 పతకాలు