Share News

ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి అమిత్ మిశ్రా.. గంగూలీ, యువీలతో పాటు..!

ABN , Publish Date - Oct 21 , 2026 | 06:00 PM

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ మరో భారత మాజీ క్రికెటర్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. టీమిండియా మాజీ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాను జట్టు స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి అమిత్ మిశ్రా.. గంగూలీ, యువీలతో పాటు..!
Amit Mishra

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ మరో భారత మాజీ క్రికెటర్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. టీమిండియా మాజీ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాను జట్టు స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. దీంతో ఐపీఎల్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఢిల్లీ జట్టుతోనే మిశ్రా కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనున్నాడు. 43 ఏళ్ల మిశ్రా 2025 సెప్టెంబర్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కోచ్‌గా ఐపీఎల్‌లో బాధ్యతలు చేపట్టడం అతడికి ఇదే తొలిసారి.


ఢిల్లీ క్యాపిటల్స్‌ విడుదల చేసిన వీడియోలో మిశ్రా మాట్లాడుతూ.. ఢిల్లీ జట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘ఐపీఎల్‌ తొలి సీజన్‌లో నేను ఢిల్లీ జట్టులోనే ఉన్నాను. ఇప్పుడు నా కోచింగ్‌ ప్రయాణాన్ని కూడా ఇదే జట్టుతో ప్రారంభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్న విజయాన్ని ఢిల్లీ అభిమానులకు అందించేందుకు ప్రయత్నిస్తాం’ అని మిశ్రా పేర్కొన్నాడు.


కోచింగ్‌ బృందంలో కీలక మార్పులు

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచింగ్‌ బృందంలో ఇప్పటికే పలువురు మాజీ భారత క్రికెటర్లు చేరిన సంగతి తెలిసిందే. ప్రధాన కోచ్‌గా సౌరభ్ గంగూలీ బాధ్యతలు చేపట్టగా, యువరాజ్‌ సింగ్‌ అసిస్టెంట్ కోచ్‌గానూ, బ్యాటింగ్‌ కోచ్‌గానూ వ్యవహరించనున్నాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా చమిందా వాస్‌ కూడా జట్టుతో కలిసి పనిచేయనున్నాడు.


ఇవి కూడా చదవండి:

బుమ్రా కాదు.. భువీ బౌలింగ్ అత్యంత ప్రమాదకరం: కివీస్ మాజీ క్రికెటర్

పారా ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. ఖాతాలో 54 పతకాలు

Updated Date - Oct 21 , 2026 | 06:00 PM