టీపీసీసీ అధికార ప్రతినిధుల నియామకాలకు బ్రేక్
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:59 AM
టీపీసీసీకి కొత్తగా 49 మంది అధికార ప్రతినిధులను నియమిస్తూ మీడియా కమిటీ చైర్మన్ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల విడుదల చేసిన జాబితా హోల్డ్‌లో పడింది.
సామా ఫిర్యాదు.. కొందరు ఎమ్మెల్యేల అభ్యంతరాలు
నియామకాల నిలిపివేతకు పవన్ ఖేరా ఆదేశం
హైదరాబాద్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): టీపీసీసీకి కొత్తగా 49 మంది అధికార ప్రతినిధులను నియమిస్తూ మీడియా కమిటీ చైర్మన్ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల విడుదల చేసిన జాబితా హోల్డ్‌లో పడింది. ఈ నియామకాలపైన ఫిర్యాదులు రావడంతో వాటిని నిలిపేయాలంటూ ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ పవన్‌ఖేరా తాజాగా ఆదేశించారు. వాస్తవానికి టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్, పవన్ ఖేరాల సూచనల మేరకే కొత్తగా అధికార ప్రతినిధులు, టీవీ డిబేట్లు.. మీడియా బ్రీఫింగ్‌కు సంబంధించిన ప్యానల్ జాబితాను ప్రకటిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఏఐసీసీ కార్యక్రమం టాలెంట్ హంట్‌లో ఎంపిక చేసిన వారి పేర్లను అధికార ప్రతినిధుల్లో చేర్చలేదంటూ ఆ కార్యక్రమ నిర్వాహకుడు సామా రామ్మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అలాగే ఈ జాబితాకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ ఉత్తర్వులను నిలిపి వేయాలంటూ పవన్ ఖేరా ఆదేశించినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కాగా.. చిన్న సాంకేతిక సమస్య వల్ల జాబితా ఆగిపోయిందని, మరి కొన్ని పేర్లు కలిపి రెండు, మూడు రోజుల్లో కొత్త జాబితా ఇస్తామని బుధవారం ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి చామల వెల్లడించారు. మంచి చేస్తే ఓర్చుకోలేనివారు ఉంటారన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అభ్యంతరాలు తెలిపిన మాట వాస్తవమేనన్నారు. పనిచేసేవాళ్లకు పదవులు ఇస్తున్నప్పుడు అడ్డుకోవద్దని వారిని కోరానని, మాట్లాడే నైపుణ్యం ఉన్నవారికి మీడియా బ్రీఫింగ్ బాధ్యత ఇస్తే తప్పేముందన్నారు. జాబితా రూపొందించేటప్పుడు సామా రామ్మోహన్‌రెడ్డి టాలెంట్‌హంట్ గురించి చెప్పలేదన్నారు. చామలకు, తనకు గ్యాప్ లేదని, ఆయన్ను తానే ఏరి కోరి తెచ్చుకున్నానని మహేశ్‌గౌడ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News