ప్రయాణికులకు ఆర్టీసీ బంపరాఫర్ !
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:50 AM
ప్రైవేటు ట్రావెల్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడంతోపాటు బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది.
బెంగళూరు, మైసూరు, విజయవాడ,
గుంటూరు మార్గాల్లో టిక్కెట్ ధర తగ్గింపు
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ట్రావెల్స్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడంతోపాటు బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఎంపిక చేసిన బస్సు సర్వీసుల్లో టికెట్ ధరలను తగ్గించింది. దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబరు 31 వరకు ఆయా మార్గాల్లో టిక్కెట్ ధరలపై ఆర్టీసీ రాయితీ కల్పించనుంది.
తగ్గింపు ఇలా..
బస్సు రూటు | బస్సు టైపు | ప్రస్తుత టికెట్ ధర | తగ్గింపు తర్వాత | ఆదా |
హైదరాబాద్-మైసూరు | ఏసీ స్లీపర్ | రూ.2,420 | రూ.1,800 | రూ.620 |
హైదరాబాద్-బెంగళూరు | ఏసీ స్లీపర్ | రూ.1,440 | రూ.1,200 | రూ.240 |
హైదరాబాద్-విజయవాడ | రాజధాని | రూ.600 | రూ.500 | రూ.100 |
హైదరాబాద్-గుంటూరు | సూపర్ లగ్జరీ | రూ.530 | రూ.450 | రూ.80 |
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి చాటాలి
కొడంగల్లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News