కాంగ్రెస్‌లో మీడియా నియామకాలపై చామల క్లారిటీ.. త్వరలోనే కొత్త జాబితా
ABN , Publish Date - Nov 11 , 2026 | 12:21 PM
తెలంగాణ కాంగ్రెస్‌లో 20 మంది మీడియా ప్యానలిస్టులు, కోఆర్డినేటర్లు, అధికార ప్రతినిధుల నియామకాల నిలిపివేతపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.
హైదరాబాద్, నవంబర్ 11: టీపీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ వింగ్ ఛైర్మన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన 20 మంది మీడియా ప్యానలిస్టులు, కోఆర్డినేటర్లు, అధికార ప్రతినిధుల నియామకాలను తెలంగాణ కాంగ్రెస్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ అంశం టీ.కాంగ్రెస్‌లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. దీనిపై తాజాగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. వివరణ ఇచ్చారు.
ఈరోజు (బుధవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో తనకు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. ఇద్దరం కలిసే జాబితాను తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల లిస్ట్ ఆగిపోయిందని వివరించారు. లిస్ట్ ఏమీ ఆగిపోదని.. ఇంకొన్ని పేర్లు కలిపి కొత్త జాబితాను విడుదల చేస్తామన్నారు. రెండు, మూడు రోజుల్లో కొత్త లిస్ట్‌ను ప్రకటించనున్నట్లు ఎంపీ తెలిపారు.
మంచి చేసే ఓర్చుకోలేని వాళ్లు ఉంటారని ఎంపీ వ్యాఖ్యానించారు. కొంత మంది ఎమ్మెల్యేలు కాల్ చేసింది నిజమే అని.. పని చేసే వాళ్లకు పదవులు ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు అడ్డుకోవద్దని సూచించారు. ఎమ్మెల్యేలు పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. కొందరు ఎమ్మెల్యేలు అభద్రతతో టెన్షన్ పడినట్లు తెలిపారు. వాళ్లకు తెలియకుండా లిస్ట్ ఇచ్చామని కొందరు ఎమ్మెల్యేలు ఫోన్ చేశారన్నారు. ఎమ్మెల్యేలు లీడర్లను తయారు చేయాలన్నారు. సామ రామ్మోహన్ పెట్టిన టాలెంట్ టెస్ట్ గురించి తనకు చెప్పలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో రెండోసారి ‘భారత్ సమ్మిట్’.. ప్రపంచ పరిస్థితులపై చర్చలు: సల్మాన్ ఖుర్షీద్
‘డబ్బులకు ఆశపడకుండా ఓటేయండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు
Read Latest Telangana News And Telugu News