558 మంది బోధనాస్పత్రుల సిబ్బంది తిరిగి వైద్య విధాన పరిషత్‌కు..
ABN , Publish Date - Nov 11 , 2026 | 07:00 AM
వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ఉద్యోగులు తిరిగి మాతృ సంస్థకు వెళ్లనున్నారు.
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ఉద్యోగులు తిరిగి మాతృ సంస్థకు వెళ్లనున్నారు. ప్రస్తుతం 30 ఆస్పత్రుల్లో వివిధ కేడర్లలో పనిచేస్తున్న 558 మంది ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని డీఎంఈ డాక్టర్ వాణి మంగళవారం ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు.
వీరిలో నర్సింగ్ విభాగానికి చెందిన 244 మంది, మినిస్టీరియల్ సిబ్బంది 111 మంది, క్లాస్-4 ఉద్యోగులు 116 మంది, పారామెడికల్ సిబ్బంది 48 మంది, వైద్యులు 39 మంది ఉన్నారు. రిలీవ్ అయిన ఉద్యోగులంతా ఎలాంటి మినహాయింపులు లేకుండా హైదరాబాద్ కోఠిలోని టీవీవీపీ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News