అభుదాబిలో చిక్కుకున్న తెలుగువాళ్లు
ABN , Publish Date - Feb 28 , 2026 | 08:56 PM
అభుదాబిలో పలువురు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరి అభుదాబిలో ఇతిహాద్ విమానం ఆగింది. ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రికి ఈ విమానం శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): అభుదాబిలో పలువురు తెలుగువాళ్లు (Telugu passengers) చిక్కుకుపోయారు. అమెరికా నుంచి బయలుదేరి అభుదాబిలో ఇతిహాద్ విమానం ఆగింది. ఈరోజు(శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి రాత్రికి ఈ విమానం శంషాబాద్ చేరుకోవాల్సి ఉంది. ఈ విమానంలో సుమారు 100 మందికి పైగా తెలుగువాళ్లు ఉన్నారు. అభుదాబి ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్‌పై ఈ రోజు మధ్యాహ్నం ఇరాన్ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే.
ఎయిర్ బేస్‌పై మరిన్ని దాడులు జరుగవచ్చోమోనని అభుదాబిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో అబుదాబి గగనతలాన్ని అక్కడి ప్రభుత్వం మూసివేసింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి తీవ్ర ఆందోళనలో తెలుగు ప్రయాణికులు ఉన్నారు. కాసేపటి క్రితం హోటల్‌కు పంపతామని ఇతిహాద్ సిబ్బంది చెప్పారని... అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుగు ప్రయాణికులు చెబుతున్నారు. తమను ఆదుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలుగు రాష్ట్రాల సీఎంలను ప్రయాణికులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాంపల్లి కోర్టుకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకంటే..
విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్
Read Latest Telangana News And AP News And Telugu News