అక్రమ వలసదారులెక్కడ?
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:57 AM
దేశంలోని కొన్ని వర్గాలవారి మేలు కోసమే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ సాగుతోందని.. దానిని తక్షణమే రద్దుచేయాలని తెలంగాణ ఓటర్స్ రైట్స్ ఫోరం (టీవీఆర్‌ఎఫ్) డిమాండ్ చేసింది.
ఉంటే రాష్ట్రాలవారీగా వివరాలు బయటపెట్టండి
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెలంగాణ ఓటర్స్ రైట్స్ ఫోరం సవాల్
ఎస్‌ఐఆర్ పేరుతో ప్రజల ఓటుహక్కును లాగేసుకుంటున్నారని ఆరోపణ
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): దేశంలోని కొన్ని వర్గాలవారి మేలు కోసమే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ సాగుతోందని.. దానిని తక్షణమే రద్దుచేయాలని తెలంగాణ ఓటర్స్ రైట్స్ ఫోరం (టీవీఆర్‌ఎఫ్) డిమాండ్ చేసింది. దేశంలో మూడుకోట్ల మంది విదేశీ చొరబాటుదారులు ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారని.. అదే నిజమైతే వారి వివరాలను రాష్ట్రాలు, నియోజకవర్గాలవారీగా వెల్లడించాలని సవాల్ చేసింది. టీవీఆర్‌ఎఫ్ ప్రతినిధులు, సామాజికవేత్తలు పరకాల ప్రభాకర్, ప్రొఫెసర్ హరగోపాల్, మంజుల తదితరులు మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. సర్‌పై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకేఅమిత్‌షా హైదరాబాద్ పర్యటనలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని ఆరోపించారు.
ఎస్‌ఐఆర్ ద్వారా కనుగొన్న అక్రమ వలసదారుల జాబితాను 4 వారాల్లోపు వెల్లడించాలని సుప్రీంకోర్టు మే 27న కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిందని, ఇప్పటికి 5 నెలలు గడిచినా ఆ వివరాలు బయటపెట్టలేదని విమర్శించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ గతంలో చాలాసార్లు జరిగిందన్న అమిత్‌షా వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, ఓటరు దరఖాస్తు అందకపోతే ఓటును తొలగించే ఇలాంటి ఎస్‌ఐఆర్ ఎప్పుడూ జరగలేదని స్పష్టంచేశారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో, కంటోన్మెట్ పరిధిలోని తిరుమలగిరి ప్రాంతం 150, 151 పోలింగ్ కేంద్రాల్లో టీవీఆర్‌ఎఫ్ నిర్వహించిన సర్వే, బహిరంగ విచారణలో ఎస్‌ఐఆర్‌లోని అనేక లోపాలు బయటపడ్డాయని చెప్పారు. సజీవంగా ఉన్నవారిని చనిపోయినట్లుగా చూపి ఓట్లు తొలగించారని వారు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News