తెలంగాణలో ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంపులు.. తేదీలు ఇవే!
ABN , Publish Date - Oct 13 , 2026 | 08:38 PM
తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణలో ఓటర్ల నమోదు, జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కొత్త ఓటర్లు, యువత తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఈ ప్రత్యేక క్యాంపులు చక్కటి అవకాశం. ఇందుకోసం దరఖాస్తుదారులు 'ఫారం-6' ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అలానే ఫారం-6 నింపడంలో దరఖాస్తుదారులకు బీఎల్ఓలు సహకారం అందిస్తారు. ఒకవేళ ఓటర్ల జాబితాలో పేర్లు, చిరునామాలు తదితర వివరాల్లో ఏవైనా తప్పులుంటే, వాటి సవరణ కోసం తక్షణమే అధికారులను సంప్రదించాలని ఈసీ స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని అధికారులు కోరారు. అర్హత ఉండి ఓటర్ జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణమే మా లక్ష్యం:మంత్రి ఆనం
ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్