Share News

పర్యాటక రంగానికి కృత్రిమ మేధను జోడించాలి

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:03 AM

రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఏఐ)లను విస్తృతంగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

పర్యాటక రంగానికి కృత్రిమ మేధను జోడించాలి
Telangana Tourism Policy 2025-30

  • ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం: మంత్రి జూపల్లి

హైదరాబాద్‌, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఏఐ)లను విస్తృతంగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ‘డిజిటల్‌ అజెండా-ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పర్యాటక రంగానికి కొత్త రూపు’ అనే ఇతివృత్తంతో శిల్పారామంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం-2026 కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నూతన వెబ్‌సైట్‌ను, కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు.


22,174 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ‘తెలంగాణ టూరిజం పాలసీ-2025-30’ ద్వారా రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. టూరిజం పాలసీ అమల్లోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.22,174 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని జూపల్లి చెప్పారు. పర్యాటక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులతో పాటు పీపీపీ పద్ధతిని మరింత విస్తరిస్తామన్నారు. ఈ సందర్భంగా ‘ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ టెక్నాలజీ’, ఎకో టూరిజం, ఫిల్మ్‌ టూరిజం, స్పోర్ట్స్‌ టూరిజం, హెరిటేజ్‌ టూరిజం తదితర రంగాల్లో వస్తున్న మార్పులు, అవకాశాలు అంశంపై బృంద చర్చ జరిగింది. యువ టూరిజం క్లబ్‌ల విద్యార్థులు, టూరిస్ట్‌ పోలీస్‌, తెలంగాణ దర్శిని, శిక్షణ పొందిన గైడ్స్‌, హోమ్‌స్టేపై పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. తర్వాత ఎక్సలెన్స్‌ అవార్డులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎర్రవల్లి భూముల సర్వేపై ఉత్కంఠ

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 04:03 AM