స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు ఊరట
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:33 AM
రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల సర్వీసుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
2013-14 నుంచి 2024-25 వరకు రెగ్యులర్ ప్యానళ్లకు ఆమోదం..
ఎనిమిది జీవోలు జారీ
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల సర్వీసుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2013-14 నుంచి 2024-25 వరకు ప్యానల్ సంవత్సరాలకు సంబంధించి అర్హులైన అధికారులను రెగ్యులర్ ప్యానల్లో చేర్చుతూ ప్రభుత్వం(జీవో 221 నుంచి 228 వరకు) ఎనిమిది ఉత్తర్వులు ఇచ్చింది. 2026 ఆగస్టు 5న సమావేశమైన స్ర్కీనింగ్ కమిటీ అధికారుల రికార్డులను పరిశీలించి.. వ్యక్తిగత అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం అర్హులైన అధికారుల పేర్లను రెగ్యులర్ ప్యానల్లో చేర్చాలని సిఫార్సు చేసింది.
అయితే ఈ ప్యానెళ్లలో ఉన్న పలువురు అధికారులు ఇప్పటికే ఐఏఎస్ క్యాడర్‌కు ఎంపికై ఉండటం గమనార్హం. మరికొంత మంది పదవీ విరమణ చేసిన వారూ ఉన్నారు. వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్), విజిలెన్స్ కేసులు, క్రమశిక్షణ చర్యలు అమల్లో ఉన్న కొంతమంది అధికారుల పేర్లనూ ప్యానళ్లలో పెట్టారు. అయితే ఇలాంటి కేసులు ఉన్న అధికారులకు పదోన్నతులు ఇవ్వడంతోపాటు అదనపు కలెక్టర్లుగా కీలక పోస్టులు ఎలా ఇచ్చారని కొంతమంది డిప్యూటీ కలెక్టర్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News