Share News

మా డిమాండ్‌ మేరకే ఎస్టీలకు కమిషన్‌: కవిత

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:59 AM

తరచూ తాముచేసిన డిమాండ్‌ మేరకే ప్రభుత్వం తలొగ్గి ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

మా డిమాండ్‌ మేరకే ఎస్టీలకు కమిషన్‌: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్‌, నవంబరు6(ఆంధ్రజ్యోతి): తరచూ తాముచేసిన డిమాండ్‌ మేరకే ప్రభుత్వం తలొగ్గి ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ, ఎస్టీలను కలిపి ఒకే కమిషన్‌గా ఏర్పాటు చేయడంతో అటు ఎస్సీలకు, ఇటు ఎస్టీలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని, ఈ విషయాన్నే తాను ప్రశ్నించినట్లు శుక్రవారం ఎక్స్‌ వేదికగా ఆమె తెలిపారు.


నేటికీ ఎస్సీలు సమాజంలో పీడన, అణచివేత, దౌర్జన్యాలను ఎదుర్కొంటుంటే, మరోవైపు ఆదివాసీలను రకరకాల పేర్లతో అడవి నుంచి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. గిరిజనులు తమ అస్తిత్వమైన ‘జల్‌-జంగల్‌-జమీన్‌’పై హక్కులను కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆదివాసీలు, గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వారికి మంచి చేస్తుందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 05:59 AM