ఆర్టీసీ విలీనం కోసం ప్రభుత్వంతో చర్చిస్తాం
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:37 AM
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటమి ఎదురైనా కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామని ఆర్టీసీ తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ) రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి పేర్కొన్నారు.
సీసీఎస్ ఎన్నికల్లో సత్తా చూపిస్తాం: రాజిరెడ్డి
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: బొంతు
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటమి ఎదురైనా కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామని ఆర్టీసీ తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ) రాష్ట్ర అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోపాటు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వంతో చర్చిస్తామని, సమస్యల పరిష్కారానికి అవసరమైతే పోరాటాలు చేస్తామని, ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో సత్తా చాటుతామని పేర్కొన్నారు.
బాగ్‌లింగంపల్లిలోని వీఎస్‌టీ ఫంక్షన్ హాల్‌లో టీడబ్ల్యూయూ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల సమీక్ష సమావేశంలో రాజిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో తమ యూనియన్‌కు మద్దతుగా 14 వేల మంది కార్మికులు ఓటు వేశారని తెలిపారు. మొత్తం 49 డిపోల్లో విజయం సాధించినట్లు పేర్కొన్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వ్యభిచారం చెయ్.. భార్యపై తాగుబోతు భర్త ఒత్తిడి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News