వ్యభిచారం చెయ్.. భార్యపై తాగుబోతు భర్త ఒత్తిడి!
ABN , Publish Date - Oct 28 , 2026 | 04:26 AM
మద్యానికి బానిసై, స్నేహితుల వద్ద డబ్బులు తీసుకున్న వ్యక్తి, ఆ అప్పు తీర్చేందుకు కట్టుకున్న భార్యను ఆ మిత్రులతో గడపాలని ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో స్నేహితులను ఇంటికి పిలిపించి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు.
ముగ్గురు స్నేహితులతో
కలిసి ఆమెపై గ్యాంగ్‌రేప్
కేసు నమోదు.. ముగ్గురి
అరెస్టు.. పరారీలో భర్త
వీరంతా మయన్మార్ దేశస్థులే
హైదరాబాద్ సిటీ, చంపాపేట, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మద్యానికి బానిసై, స్నేహితుల వద్ద డబ్బులు తీసుకున్న వ్యక్తి, ఆ అప్పు తీర్చేందుకు కట్టుకున్న భార్యను ఆ మిత్రులతో గడపాలని ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో స్నేహితులను ఇంటికి పిలిపించి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేనా, ఆమెను ఇంట్లో బంధించి.. తరచూ స్నేహితులతో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. చంపాపేటలో ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడు మహ్మద్ ఫయాజ్ (30). అతడు మయన్మార్ దేశస్తుడు. అక్రమంగా భారత్‌లో అడుగుపెట్టి హైదరాబాద్ కొచ్చాడు. మయన్మార్‌కే చెందిన యువతి (20)ని పెళ్లి చేసుకున్నాడు. కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రోషన్‌దౌలా బస్తీ సమీపంలో భార్యతో కలిసి ఫయాజ్ ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
ఫయాజ్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. భార్య కూలీ పనికి వెళుతోంది. కొన్నాళ్లుగా మద్యానికి బానిసైన ఫయాజ్ పనికి వెళ్లడంలేదు. డబ్బుల కోసం వ్యభిచారం చేయాలని భార్యను వేధిస్తున్నాడు. తన స్నేహితులు, మయన్మార్‌కు చెందిన కమల్(30), ముజీబ్(31), రెహమాన్ అలియాస్ ఇబ్రహీం(29) వద్ద డబ్బు తీసుకొని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ముగ్గురితో గడపాలని భార్యపై ఒత్తిడి చేశాడు. తిరస్కరించిన ఆమెపై ఆ ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఇంట్లోనే ఆమెను బంధించి.. కొన్నాళ్లుగా ఆ ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. ఈనెల 23న భార్యను ఫయాజ్ ఇంట్లోనే బంధించి బయటనుంచి తాళం వేసి వెళ్లిపోయాడు. 26న ఇంటి అద్దెకోసం యజమాని, ఇంటివద్దకు రాగా లోపలి నుంచి ఏడ్పు వినిపించింది.
స్థానికులతో కలిసి ఆయన తాళం పగలగొట్టి ఆమెను రక్షించాడు. వెంటనే ఆమె బాలాపూర్‌లో ఉంటున్న మయన్మార్‌కు చెందిన తన స్నేహితురాలి భర్త అబ్దుల్ జహీర్ సహకారంతో వారి ఇంటికి వెళ్లిపోయింది. తనపై జరిగిన దారుణంపై ఆమె సోమవారం కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త ఫయాజ్, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కమల్, ముజీబ్, రెహమాన్‌ను అరెస్టు చేశారు. భర్త ఫయాజ్ పరారీలో ఉన్నట్లు సీఐ బాలరాజు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News